ఆదిపురుష్ అప్డేట్.. ‘జై శ్రీరామ్’ లిరికల్ మోషన్ పోస్టర్ రిలీజ్

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…ప్రస్తుతం ప్రభాస్… వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఆది పురుష్ కు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. ‘జైశ్రీరామ్..’ అంటూ సాగే పాట లిరికల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హిందీ, తెలుగు భాషల్లో ఈ మోషన్ పోస్టర్లను ప్రభాస్ షేర్ చేశారు. ‘చార్ దామ్ దర్శించుకోలేకుంటే, ప్రభువు శ్రీరాముడి పేరు స్మరించుకుంటే చాలు’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానున్నట్టు ఇటీవల మూవీటీమ్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version