అదా‌శర్మ సరికొత్త అవతార్.. విల్లుతో పోరాటం చేయబోతున్న హీరోయిన్..!

బ్యూటిఫుల్ హీరోయిన్ అదాశర్మ తన నూతన ప్రాజెక్టును సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘న్యూ మూవీ, న్యూ హ్యూమన్, న్యూ లుక్ ’ అనే క్యాప్షన్ తో వెరీ డిఫరెంట్ ఫొటోలు షేర్ చేసింది హీరోయిన్ అదా శర్మ. హండ్రెడ్ ఇయర్స్ ఫర్ అదాశర్మ..అదా శర్మ. న్యూప్రాజెక్ట్ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇన్ స్టా గ్రామ్ క్యాప్షన్ లో ఇచ్చింది ఈ హీరోయిన్.

ఇక ఈ భామ షేర్ చేసిన ఫొటోల్లో అదాశర్మ సరి కొత్త ‘అవతార్’లో కనబడుతోంది. జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సినిమాలోని అవతార్ మాదిరిగా పొడవాటి విల్లు ధరించిన అదాశర్మ… తన భుజంపైన బాణాలను స్టోర్ చేసుకున్నట్లు కనబడుతోంది. అయితే, తాను చేయబోయే ప్రాజెక్టు ఇదేనంటూ అదాశర్మ ప్రకటించలేదు. కానీ, సరి కొత్త ప్రాజెక్టు అని చెప్తోంది.

అందులో తాను పోషించబోయే పాత్ర ఏదై ఉంటుందో చెప్పండని అంటూ అదాశర్మ నెటిజన్లనే ప్రశ్నిస్తున్నది. ఇక వేరే ఫొటోల్లో అదాశర్మ బాక్సింగ్ గ్లౌజులు ధరించి ఉంది. గన్ పట్టుకుని, కత్తి పట్టుకుని , నిలబడి, కాళ్లతో తంతున్నట్లు ఇలా రకరకాల ఫోజులిచ్చిన ఫొటోలు షేర్ చేసిన అదాశర్మ..తాను పోషించబోయే పాత్ర ఏదో మీరే చెప్పండని అంటూ నెటిజన్లను అడిగింది. అదాశర్మ.. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ మూవీ‌తో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)