Adipurush : OTTలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్’.. ఎందులో అంటే?

-

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. ఎన్నో వివాదాలు, ట్రోలింగ్​లను ఎదుర్కొంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆదిపురుష్ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వివాదాలు.. ట్రోలింగే. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ ట్రోలింగ్ బాధ తప్పలేదు.

ఎంత నెగిటివిటీని ఎదుర్కొన్నా ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రేమించారు. ఆ ప్రేమకు ప్రతిరూపమే ఆదిపురుష్ బాక్సాఫీస్ కలెక్షన్లు. ఈ సినిమా స్టోరీ సంగతి ఎలా ఉన్నా.. యాక్టింగ్ గురించి పక్కన బెడితే.. ఈ మూవీలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. అయితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్‌ చేశారు. ఇక థియేటర్ లో మిస్‌ అయినవాళ్లు.. ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version