రామ్ చరణ్ ట్వీట్‌కు అలా రిప్లయి ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో..ఎవరంటే?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…RRR పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్రకు..జనాలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో.. అయితే రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ RC 15 కోసం ప్రజలు, సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమాపైన చేసిన ట్వీట్ కు ఆ హీరో ఇచ్చిన రిప్లయి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’.. అన్నా చెల్లెళ్ల అనుబంధంపైన తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ ఫిల్మ్ ట్రైలర్ చూసిన రామ్ చరణ్..అక్షయ్ కుమార్ సర్ ..ట్రైలర్ బ్యూటిఫుల్ గా ఉందని ట్వీట్ చేశాడు.

ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ట్వీట్ కు అక్షయ్ కుమార్ రిప్లయి ట్వీట్ ఇచ్చాడు. థాంక్యూ సో..మచ్ ..రామ్ చరణ్ అన్న అని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ ను అలా ‘అన్న’ అని సంబోధించడం చూసి మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.