ముసలోడిగా అల్లు అర్జున్ అదరగొట్టేశాడు.. ‘7..UP’ వీడియో వైరల్..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు. ‘పుష్ప’ రాజ్ గా ఈ పిక్చర్ లో అల్లు అర్జున్ అభినయం చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పుష్ప-2 కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. అల్లు అర్జున ఓల్డ్ వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సదరు వీడియోలో అల్లు అర్జున్ ‘ముసలోడి’ గెటప్ లో ఓ థియేటర్ వద్దకు వెళ్లి హల్ చల్ చేస్తున్నాడు. థియేటర్ కౌంటర్ లో టికెట్ అడగగా లేవని చెప్పగా, తాను అల్లు అర్జున్ చెప్తే నమ్మబోడు. తాను చిరంజీవి అని చెప్పి కామెడీ చేస్తాడు. దాంతో బయటకు వచ్చిన అల్లు అర్జున్ తన ఒరిజనల్ గెటప్ లో ‘దేశముదురు’ సినిమా పాటకు స్టెప్పులేస్తాడు. అలా అభిమానులు ఆయన వద్దకు వస్తారు.

అలా థియేటర్ బయట సందడి వాతావరణ నెలకొనగా, ‘సార్ లోపలికి రండి’ అని థియేటర్ కౌంటర్ లో ఉండే పర్సన్ అడుగుతాడు. అప్పుడు తాను తన ఫ్యా్న్స్ తో ఉంటానని చెప్తూ..‘7.UP’ కూల్ డ్రింక్ గురించి ప్రమోట్ చేస్తాడు. ఈ యాడ్ వీడియోను తాజాగా కొందరు నెటిజన్లు షేర్ చేయగా, యూట్యూబ్ లో అది ట్రెండవుతోంది. అల్లు అర్జున్ అప్పట్లో ఓల్డ్ పర్సన్ గా అదరగొట్టేశాడని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news