చీరలో మెరిసిపోతున్న టిల్లు బ్యూటీ అనుపమ

-

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వర్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తరచూ తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక షూటింగ్స్ నుంచి టైం దొరికితే చాలు ఫొటోషూట్స్తో టైంపాస్ చేస్తుంది. సాధారణంగా అనుపమ క్యాజువల్ ఔట్ఫిట్స్లోనే క్యూట్ క్యూట్ ఫొటోలతో మతి పోగొడుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అందంగా రెడీ అయి తన బ్యూటీతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది.

లేటెస్ట్గా ఇలాంటి బ్యూటీఫుల్ ఫొటోషూట్తోనే కుర్రకారు మనసు దోచేసింది అనుపమ. గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీలో బుట్టబొమ్మలా రెడీ అయింది. సంప్రదాయంగా చెవికి దుద్దులు, కళ్లకు కాటుక, ముఖానికి బొట్టు పెట్టుకుని అచ్చతెలుగు ఆడపిల్లలా కనిపించింది. ఇక ఈ శారీలో తన క్యూట్ పోజులతో మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనుపమ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంతందంగా ఉంటే ఎలా అనూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనుపమ కెరీర్ సంగతికి వస్తే ఈ భామ టిల్లు స్క్వేర్ సినిమాతో త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఫుల్ బోల్డ్ అవతార్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version