మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురాం తో తన తర్వాతి సినిమాను బాలయ్య చెయ్యనున్నారని సమాచారం అందుతోంది. అయితే తాజాగా బాలయ్యకు పరశురాం కథ వినిపించారని బాలయ్య దీనికి సమాచారం. మొత్తానికి పరుశురాం – బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.