టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘స్వయం కృషి’కి కేరాఫ్ అని చెప్పొచ్చు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన తన కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని ఎదిగిన చిరంజీవి.. ఇప్పుడు ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయ్యారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇక చిరంజీవి..డ్యాన్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న డ్యాన్స్ ట్రెండ్ ను పక్కనబెట్టి కొత్త ట్రెండ్ ను తన డ్యాన్సింగ్ స్టైల్ తో క్రియేట్ చేశారు మెగాస్టార్. బాడీని మూవీ చేయడంతో పాటు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ చేయడంలో సరి కొత్త స్టాండర్డ్స్ ను మెగాస్టార్ సెట్ చేశారని చెప్పొచ్చు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు-చిరుల కాంబోలో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో చిరంజీవి డ్యాన్సింగ్ స్టెప్స్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. కాగా, ఈ పాటల చిత్రీ కరణ సమయంలో చిరంజీవికి విపరీతమైన జ్వరం వచ్చింది. అయినా చిరు..షూటింగ్ లో పాల్గొన్నారు. ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ అనే సాంగ్ కు లిరిక్స్ వేటూరి అందించగా, మ్యూజిక్ ఇళయరాజా ఇచ్చారు. ఈ పాట షూటింగ్ కోసం రెండ్రోజులు మైసూరుకు వెళ్లారు.
అక్కడ మూవీ యూనిట్ సభ్యులు సెట్ వేశారు కూడా. కానీ, చిరంజీవికి 104 డిగ్రీల ఫీవర్ వచ్చింది. శ్రీదేవికి వేరే బాలీవుడ్ పిక్చర్ షూటింగ్ ఉంది. దాంతో తాను నో చెప్తే.. షూటింగ్ వాయిదా పడుతున్న ఉద్దేశంతో చిరంజీవి జ్వరంతోనే డ్యాన్స్ చేశారు.
అలా ఆ పాట తెలుగు చిత్ర సీమలో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ కాగా, పాటల షూటింగ్ కోసం దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. అలా ఒక్కో పాటకు రోజుల పాట సమయం తీసుకున్నారు. ఈ చిత్ర సీక్వెల్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి -2’ రావాలని సినీ అభిమానులు కోరుతున్నారు. కానీ, మేకర్స్ మాత్రం ఆ దిశగా అంతగా ఆలోచన చేయడం లేదనిపిస్తోంది.