Big Boss Non Stop: అరియానా కామెంట్స్ నెక్స్ట్ లెవల్..నైట్ 11 గంటల తర్వాతే శివ డేటింగ్

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షోకు ప్రేక్షకులు రోజురోజుకూ పెరుగుతున్నారు. కంటెస్టెంట్స్ టైటిట్ విన్నింగ్ కోసం గేమ్ ను ఓ రేంజ్ లో ఆడుతున్నారు. కెప్టెన్సీ కోసం అయితే కంటెస్టెంట్స్ తమదైన శైలిలో డీల్స్ కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. శివ కెప్టెన్సీ కోసం చివరి వరకు ట్రై చేశాడు. అయితే, ‘యూఆర్ నాట్ మై కెప్టెన్’ అని పలువురు కంటెస్టెంట్స్ బాణాలు గుచ్చారు. దాంతో శివకు కెప్టెన్సీ దక్కలేదు.

అషురెడ్డి కెప్టెన్ అయిపోగా, ఆట ఇంకా రసవత్తరంగా మారింది. ఇక కంటెస్టెంట్స్ మార్నింగ్ ఫన్నీ టాక్స్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో? అనే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా శివ గురించి డిస్కషన్ జరుగుతున్నది. అరియానా శివ గురించి కంటెస్టెంట్స్ అందిరికీ వివరించింది.
యాంకర్ శివ ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అమ్మాయిల కోసం ట్రై చేస్తాడని చెప్పింది. శివ స్టైల్ ఆఫ్ డేటింగ్ ఎక్స్ ప్లెయిన్ చేసింది.

శివ జనరల్ గా బిజీగా లేకపోయినా తాను సెలబ్రిటినీ ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లానని, తన గర్ల్ ఫ్రెండ్ కు మెసేజ్ చేస్తాడని, తిన్నా కాని తినలేదని చెప్తాడని అంది. ఈ క్రమంలోనే నైట్ 11 గంటల తర్వాతే అసలు కథ షురూ చేస్తాడని స్పష్టం చేసింది. నీ ఫస్ట్ ‘లవ్ స్టోరి’ ఏంటి? అంటూ కబుర్లు చెప్పడం స్టార్ట్ చేసి అలా ఆ అమ్మాయిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తాడని వివరించింది అరియానా. అరియానా మాటలను కంటెస్టెంట్స్ అందరూ చాలా ఓపికగా వింటుడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version