Big Boss Non Stop: హౌజ్ నుంచి బాబా మాస్టర్, అషురెడ్డి ఎలిమినేషన్..ప్రోమో వైరల్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతారనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎనిమిదో వారం గేమ్ ఆసక్తికరంగా సాగింది. తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన ప్రోమో బీబీ లవర్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. సదరు ప్రోమో నెట్టింట బాగా వైరలవుతోంది.

‘బిగ్ బాస్’ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో ప్రకారం..ఇంటి నుంచి బయటకు వెళ్లేపుడు ఎవరిని తీసుకెళ్తావ్? అని నాగార్జున బాబా మాస్టర్ ను అడిగారు. అప్పుడు బాబా భాస్కర్ అషురెడ్డి పేరు చెప్పాడు. దాంతో అషు షాక్ అయింది. తన పేరు ఎందుకు చెప్పాడో అర్థం కావడం లేదని, తన మైండ్ బ్లాంక్ అయిందని అంటుంది.

బాబా భాస్కర్ మాట్లాడుతూ ఆమె ఎక్కడైతే కాన్సంట్రేట్ చేయాలో అక్కడ చేయడం లేదని, ఎక్కడైతే చేయకూడదో అక్కడే ఫోకస్ చేస్తున్నదని అన్నాడు. కాగా, హౌజ్ లోకి వచ్చిన నాలుగు రోజుల్లో తన గేమ్ ను బాబా మాస్టర్ ఎలా డిసైడ్ చేశాడని అడుగుతుంది.

అంతలో నాగార్జున కలుగజేసుకుని ‘అషు ..నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావా’? అని అడుగుతాడు..అంతటితో ప్రోమో ముగుస్తుంది. ఈ ప్రోమోను బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరేనా అనే సస్పెన్స్ క్రియేట్ అయింది. చూడాలి మరి..అఫీషియల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారో..

Read more RELATED
Recommended to you

Latest news