బిత్తిరి సత్తి మాటలకు పడి పడి నవ్విన రష్మిక.. వీడియో వైరల్!

నేషనల్ క్రష్..రష్మిక మందన కీలక పాత్ర పోషించిన ‘సీతారామం’ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. మాలీవుడ్(మలయాళం) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ పిక్చర్ లో సుమంత్ మరో కీలక పాత్ర పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ ప్రొడ్యూస్ చేశాయి.

 

ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు తాజాగా యాంకర్ బిత్తిరి సత్తి రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ఇందులో బిత్తిరి సత్తి..తనదైన శైలిలో ఫన్నీ క్వశ్చన్స్ అడిగి రష్మిక మందనను నవ్వించాడు.

బిత్తిరి సత్తి మాటలకు ఫిదా అయిన రష్మిక ..ఇంటర్వ్యూ మొత్తం నవ్వుతూనే సత్తి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. సత్తి మాటలకు నవ్వి నవ్వి తన బుగ్గలు నొప్పి పెడుతున్నాయని రష్మిక చివరికి అనేసింది కూడా. లెఫ్టినెంట్ రామ్ -సీత(మహాలక్ష్మి) మధ్య ఉన్న చక్కటి లవ్ స్టోరిని కలిపే వ్యక్తిగా తాను కనబడతానని రష్మిక చెప్పకనే చెప్పేసింది. ఇందులో ముస్లిం యువతిగా రష్మిక మందన కనిపించింది.

తన కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని రష్మిక మందన కాన్ఫిడెంట్ గా చెప్తోంది. ‘పుష్ప’ చిత్రంలో చివరగా కనిపించిన రష్మిక మందన..త్వరలో ‘సీతారామం’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఇంటర్వ్యూ మొత్తం నవ్వులే నవ్వులు అన్నట్లుగా సాగడం విశేషం.