సెన్సార్ బోర్డుకు లంచం.. వ్యవస్థనే కుదిపేసిన విశాల్..!

-

హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేశారు. విడుదలకు ముందు మార్క్ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్ ను సెన్సార్ బోర్డు కు పంపించగా.. అక్కడ సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ కావాలంటే రూ.6.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్టుగానే విశాల్ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తరువాత సెన్సార్ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్టు.. దానికి సంబంధించిన బ్యాంక్ చలానా సోషల్ మీడియాలో షేర్ చేశారు విశాల్.

ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర పై సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్ బోర్డు సభ్యులు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్ కార్యదర్శి హరి కుమార్ ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. హరికుమార్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విశాల్ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద సినిమాలకు చెన్నైలోనే సెన్సార్ సర్టిఫికెట్ అందించేవిదంగా చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version