నిత్యామీనన్ కు కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్..!!

-

తెలుగులో మొదటిసారి హీరో నాని నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ నిత్య మీనన్.. అందంతో కుర్రకారులను బాగానే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ తోనే అవకాశాలను అందుకుంది. కొన్ని చిత్రాలలో పాటలు పాడి కూడా అలరించింది నిత్యామీనన్. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి చిత్రాలలో కూడా నటించింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో కూడా నటించింది.

అలాగే ప్రముఖ ఓటీటి సమస్త ఆయన అహ లో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది నిత్యామీనన్.. తాజాగా నిత్య మీనన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ఇండస్ట్రీలో ఇప్పటికి ఎంతోమంది నటీమణులు సైతం క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించడం జరిగింది.చాలామంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి పలు ఇంటర్వ్యూలలో కూడా తమకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తెలియజేయడం జరిగింది

తాజాగా హీరోయిన్ నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించడం జరిగింది.. తన పెళ్లి గురించి చాలా వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ వార్తల పైన కూడా స్పందించింది.. క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందిస్తూ కామాంధులు అన్ని రంగాలలో కూడా ఉన్నారు.. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు.. కానీ తమిళంలో మాత్రం ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఒక హీరో తనని చాలా వేధించారని తెలియజేసింది.. ముఖ్యంగా అసభ్యంగా తాగుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని తెలిపింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కానీ ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం తెలుపలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version