నిర్మాత‌ బండ్ల గణేష్ కు మూడోసారి కరోనా

-

టాలీవుడ్ న‌టీ న‌టుల‌ను క‌రోనా వైర‌స్ వెంటాడుతునే ఉంది. ప్ర‌తి రోజు క‌నీసం ఒక్క‌రు అయిన క‌రోనా బారీన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ థ‌మ‌న్, హీరో విశ్వ‌క్ సేన్ తో పాటు చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా టాలీవుడ్ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని తాజాగా నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించాడు.

అయితే బండ్ల గ‌ణేష్ గ‌త మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. అయితే త‌నకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో తాను ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోనే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసుకున్నాని తెలిపారు. అందులో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని అన్నారు. అయితే త‌న కుటుంబ స‌భ్యుల‌కు మాత్రం నెగిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే తాను ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉన్నాని తెలిపారు అయితే క‌రోనా వ్యాప్తి వేగంగా ఉంద‌ని అంద‌రూ ద‌యచేసి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. కాగ నిర్మాత బండ్ల గ‌ణేష్ కు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు క‌రోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version