NTR: గుంటూరులో దేవర సక్సెస్ మీట్..రంగంలోకి బాలయ్య, బాబు ?

-

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సక్సెస్ మీట్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతుంది. గుంటూరులో ఈ ఈవెంట్ ను అక్టోబర్ మూడో తేదీ అంటే ఎల్లుండి నిర్వహించాలని భారీ ప్లాన్ వేస్తున్నారట. అయితే ఈవెంట్ కు చంద్రబాబు నాయుడు అలాగే బాలయ్య బాబు కూడా స్పెషల్ గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కుటుంబం మధ్య గ్యాప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ గ్యాప్ ను ఫిలప్ చేసేందుకు… ప్లాన్ వేస్తున్నారట. అందుకే నందమూరి బాలయ్య అలాగే చంద్రబాబు నాయుడు ను ఈ ఈవెంట్ కు పిలిచినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాకా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా దాదాపు 350 కోట్లను వసూలు చేసింది. మరో వారం రోజుల్లో 1000 కోట్లు కూడా క్రాస్ చేసే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట నెగిటివ్ వచ్చినప్పటికీ… ఈ సినిమా మంచి పిక్ అప్ అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version