అందాలతో అదరహో అనిపించిన డింపుల్ హయాతి..!

-

ప్రముఖ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా నటిస్తున్న చిత్రం రామబాణం. ఇందులో హీరోగా మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ఈ సినిమా మే 5వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇప్పటికే లౌక్యం, లక్ష్యం వంటి సినిమాలు చేసిన శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడవ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.

ఇకపోతే సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో డింపుల్ హయతి గ్లామర్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటమ్ సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత కుర్రాళ్ళు మెచ్చేలా హాట్ అందాలతో దర్శకుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఇక చివరిగా మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో నటించిన ఈమె తన అందాల ఆరబోతతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఈ అమ్మడి గ్లామర్ షో కి ప్రతిఫలం లభించిందనే చెప్పాలి. ఈ మేరకు ఈమెకు ఇప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు లభిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుర్రాళ్లకు కలల రాణిగా మారిపోయింది. కళ్ళు చెదిరే వైట్ డ్రెస్ లో.. ఎద ఎత్తులు చూపిస్తూ అందరిని ఆకట్టుకుంది.తన సన్నని చిరునవ్వుతో యువత హృదయాల్లో చిచ్చు పెట్టింది. మొత్తానికైతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది డింపుల్ హయాతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version