తారక్ కోసం రాసిన ఆ కథలో అల్లు అర్జున్ ఎలా హీరో అయ్యారో చెప్పిన డైరెక్టర్ వక్కంతం వంశీ..

-

దర్శకుడు వక్కంతం వంశీ తాజాగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్ గా విచ్చేశారు ఈ ఈ సందర్భంగా పల ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చిన ఆయన అల్లు అర్జున్తో అనుకోకుండా నా పేరు సూర్య సినిమా తీశానని.. అయితే ముందుగా ఆ సినిమాకు హీరోగా ఆయన అనుకోలేదని చెప్పుకొచ్చారు..

రైటర్ గా దర్శకుడుగా ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు వక్కంతం వంశీ అయితే ఈయన తన కెరియర్ స్టార్టింగ్ లో సురేందర్ రెడ్డి సినిమాలకు కథలు అందించేవారు ఆ తర్వాత దర్శకత్వం మీద ఆసక్తితో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొని ఇటువైపు అడుగులు వేశారు.. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వంశీ పల ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు..

“నాకు ముందు నుంచి దర్శకత్వం అంటే ఆసక్తి ఉండేది అయితే అవకాశం కోసం దాదాపు 5 ఏళ్ళు శ్రమించాను అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రంలో ముందుగా తారక్ ను అనుకున్నాం.. ఆయనే నన్ను డైరెక్టర్​గా చేస్తానన్నారు. తన కోసమే కథ రాసుకున్నా. ఎన్టీఆర్​ ఆర్ట్స్​ బ్యానర్​పై సినిమా తెరకెక్కాలి. కథ విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది. అలా ఆ కథ పక్కన పెట్టా. ముందు ఏదో సినిమా ఒకటి చేద్దామని ఆ తర్వాత మళ్లీ రాశాను. అదే సమయంలో బన్నీ కోసం రేసుగుర్రం సినిమా కోసం స్టోరీ రాస్తున్నాను. అలా బన్నీతో పరిచయం ఉండడంతో నాపేరు సూర్య కథ ఆయనకు చెప్పా. వెంటనే ఆయన ఓకే చెప్పారు.” అని చెప్పుకొచ్చారు..

అయితే వంశీ రైటర్, డైరెక్టర్ గానే కాదు హీరోగా కూడా ఒక సినిమా చేశారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో యాంకర్ సుమ హీరోయిన్​గా, వక్కంతం వంశీ హీరోగా ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రం తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version