విజయ్ దేవరకొండ మూవీలో నాగ చైతన్య బ్యూటీ !

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్​ను మలుపు తిప్పిన సినిమాల్లో ‘గీత గోవిందం’ కూడా ఒకటి. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు పరశురామ్​తో విజయ్ మరో సినిమాలో నటిస్తున్నారు. ‘VD 13’గా తెరకెక్కుతున్న సినిమా కోసం పని చేసేందుకు రెడీగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృనాల్ ఠాగూర్ నటిస్తుండగా, మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కు ఇందులో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version