మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసీఫర్ రీమేక్ కు గా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా విడుదలై మంచి వసూలను రాబడుతోంది. ఇక ఈ సినిమాలో నయనతార , సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సర్వదామన్ బెనర్జీ, గెటప్ శ్రీను, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశం కల్పించారు అని గెటప్ శ్రీను మీడియా ముందు వెల్లడించినట్లు తెలిసింది. ఇక ఈయన ఆచార్య సినిమాలో కూడా నటించారు. అయితే కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేయడం వల్ల ఈయన పాత్ర మొత్తం ఎడిటింగ్లో వెళ్లిపోయిందని గతంలో కూడా వార్తలు బాగా వినిపించాయి.
ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా గెటప్ శ్రీను పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు. ఇకపోతే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గెటప్ శీను ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చిరంజీవితో కలిసి పాల్గొన్నారు.. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలలో మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత మెగా అభిమానులు చొక్కా చింపుకోవడం ఖాయం అంటూ కూడా గొప్పగా మాట్లాడారు. ఇక అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమాలో గెటప్ శ్రీను నటించినందుకు గాను ఆయనకు నిర్మాతలు ఎంత పారితోషకం ఇచ్చారు అనే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇక ఈ క్రమంలోని ఈ సినిమాలో నటించిన గెటప్ శ్రీనుకు సుమారు రూ.12 లక్షల మేర పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.
ఇక మరొకవైపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ నటుడిగా, కమెడియన్ గా, మిమిక్రీ కూడా చేస్తూ అందర్నీ తెగ అలరిస్తున్నారు గెటప్ శ్రీను.