వెంకటేశ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘చంటి’ ఆ హీరో చేయాల్సింది..!

-

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్..కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలోనే సెంటిమెంట్ ఫిల్మ్స్ చేసి తెలుగు ఇంటి ఆడపడుచుల ఫేవరెట్ హీరో అయిపోయారు. అలా ఆయన నటించిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘చంటి’. ఈ పిక్చర్ ఇప్పటికీ టీవీల్లో వస్తే చాలు..జనాలు టీవీలకు అతుక్కుపోయి మరీ చూసేస్తుంటారు. అయితే, ఈ సినిమాను ఓ హీరో వదులుకోవడం వల్లే వెంకటేశ్ వద్దకు వచ్చిందట. ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.ఎస్.రామారావు క్రియేటివ్ కమర్షియల్ సినిమా బ్యానర్ పై ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేశారు. తమిళంలో సక్సెస్ అయిన ‘చిన్నతంబి’ చిత్ర రీమేక్ ఇది. కాగా, తొలుత దీనిని నట కిరీటి రాజేందప్రసాద్ తో చేయాలని అనుకున్నారు రామారావు.

ఆ టైమ్ లో ఈ ఫిల్మ్ వెంకటేశ్ తో చేస్తే ఎలా ఉంటుందని సురేశ్ బాబు అడిగారు. ఆయన డేట్స్ ఇస్తే ఆయనతోనే చేద్దామని కే.ఎస్.రామారావు చెప్పారు.

అలా వెంకటేశ్-కే.ఎస్.రామారావు కాంబో కుదిరి..పిక్చర్ వచ్చింది బ్లాక్ బాస్టర్ అయిపోయింది. వెంకటేశ్ -కే.ఎస్.రామారావుల కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా ‘చంటి’ నిలిచిపోయింది. మీనా, వెంకటేశ్ ల అభినయం జనాలకు బాగా నచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news