చిరంజీవి కెరీర్‌లో షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలివే..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ‘స్వయం కృషి’తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి పెద్ద అవడమే కాదు..ఇండస్ట్రీకి కష్టం వస్తే ఆదుకునేందుకు బాధ్యతా యుతమైన బిడ్డగా ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు.

ఇటీవల ఆయన ‘ఆచార్య’గా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే, ఆ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సంగతులు పక్కనబెడితే..చిరంజీవి కెరీర్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అర్ధాంతరంగా పలు కారణాల వలన ఆగిపోయాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్, చిరంజీవి కాంబోలో తెరకెక్కాల్సిన భారీ సినిమా ‘భూలోకవీరుడు’ అనివార్య కారణాల వలన ఆపేశారు. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇక క్రేజీ డైరెక్టర్ RGV అలియాస్ రామ్ గోపాల్ వర్మ-చిరంజీవి కాంబో ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అవడంతో పాటు ఒక పాట షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో టబు, ఊర్మిళలను హీరోయిన్స్ గా ఫైనల్ చేశారు. కానీ, తర్వాత సినిమా ఆగిపోయింది.

‘వజ్రాల దొంగ’ అనే సినిమా కూడా అర్ధాంతరంగానే ఆగిపోయింది. ఇకపోతే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చిరు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ, షూటింగ్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. వీఎన్ ఆదిత్య కూడా ఓ సినిమా చిరంజీవి చేయాలనుకున్నారు. కానీ, దానికీ బ్రేక్ పడింది. అలా చిరు..కెరీర్ లో పలు సినిమాలు అలా ఆగిపోయి ఉన్నాయి. ప్రజెంట్ చిరంజీవి..కుర్ర దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా, మెహర్ రమేశ్, బాబీ, వెంకీ కుడుములతో సినిమాలు చేస్తున్న చిరు..త్వరలో మారుతితోనూ సినిమా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news