వరుస ఐదు సినిమాలు ఫ్లాఫ్.. మళ్లీ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ

-

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే నటించిన గత ఐదు సినిమాలు ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో నటించిన రెండు సినిమాలు సైతం పరాజయాన్ని చవిచూసాయి ఇలా ఐదు సినిమాలు ఫ్లాప్ వచ్చినా ఈ హీరోయిన్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేనట్టు కనిపిస్తుంది.

పూజా హెగ్డే ప్రభాస్ తో కలిసి నటించిన రాధే శ్యాం సినిమా భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ బీస్ట్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. బాలీవుడ్ లో చేసిన సర్కస్, రామ్ చరణ్ తో చేసిన ఆచార్య సినిమాలు విఫలమయ్యాయి. కాగా తాజాగా బాలీవుడ్ లో సల్మాన్ తో చేసిన కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా కూడా అమ్మడికి నిరాశ మిగిల్చింది.

కాగా ఐదు ఫ్లాపులు ఉన్నా సరే అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాత్రమే కాకుండా మరో స్టార్ హీరో సినిమాలో సైతం ఈ భామ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. హిట్లతో సంబంధం లేకుండా వరుస చాన్స్ లు అందుకుంటూ పోతున్న ఈ బ్యూటీ ని చూసి ఇది ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ఒకటి రెండు ఫ్లాపులు పడితేనే అడ్రస్ లేకుండా పోతున్న హీరోయిన్స్ ఉండగా పూజా హెగ్దే మాత్రం హిట్లు వస్తున్నా మళ్లీ అవకాశాలను మాత్రం అందుకుంటూ ఫాం కొనసాగిస్తుంది. మహేష్ 28వ సినిమా హిట్ అయితే అమ్మడు మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version