చిరంజీవికి అనుకున్న కథలో రామ్ చరణ్.. సీన్ కట్ చేస్తే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన గత చిత్రం ‘ఆచార్య’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ డెఫినెట్ గా బాగా ఆడుతుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్నఈ పిక్చర్ లో భారీ తారాగణమే ఉంది. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్ తదితరులు నటించిన ఈ సినిమా విజయ దశమి కానుకగా విడుదల కానుంది.

చిరంజీవి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. కాగా, ఓ సినిమా స్టోరి చిరంజీవికి అనుకోగా, చివరకు అది ఆయన తనయుడు రామ్ చరణ్ వద్దకు వెళ్లింది. ఆ సినిమా ఏంటి? అది ఆయన వద్దకు ఎలా వెళ్లింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

magadheera
magadheera

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC 15 ఫిల్మ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా పిక్చర్ అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. చిరంజీవి కోసం అనుకున్న కథలో కథానాయకుడిగా రామ్ చరణ్ నటించారు. ఆ సినిమా ‘మగధీర’ నట.

‘మగధీర’ సినిమా రామ్ చరణ్ వద్దకు వచ్చే నాటికి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే, ఒరిజినల్ గా ఈ ఫిల్మ్ స్టోరిని చిరంజీవి కోసం అన్నట్లుగా విజయేంద్రప్రసాద్ రాసుకున్నారట. వంద మందిని చంపే యోధుడు ‘శతధ్రువంశం’ అనే కాన్సెప్ట్ చిరంజీవికి బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. కానీ, అప్పటికే చిరు రాజకీయాల్లో ఉండటం వలన ఆ స్టోరి రామ్ చరణ్ తో చేశారు దర్శకుడు రాజమౌళి.

ఇక ఈ సిని మా స్టోరిని చిరంజీవికి వినిపించే క్రమంలో చిరంజీవి తనను తాను హీరోగా ఊహించుకున్నారని ఓ సందర్భంలో ఎస్.ఎస్.రాజమౌళి చెప్పారు. అలా తండ్రి కోసం అనుకున్న స్టోరిలో తనయుడు రామ్ చరణ్ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. రామ్ చరణ్ రెండో సినిమానే రాజమౌళి దర్శకత్వంలో చేయడం విశేషం. కాగా, ఇటీవల రాజమౌళి తో RRR ఫిల్మ్ చేశారు చరణ్. ఈ పిక్చర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారని మెగా అభిమానులు అంటున్నారు.