జక్కన్నపై మరోసారి జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. వీడియో వైరల్

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయంగా సత్తా చాటిన విషయం తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నటులు కూడా జక్కన్నపై, ఆర్ఆర్ఆర్ సినిమాపై తెగ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల అమెరికాలో 51వ వార్షిక సాటర్స్ అవార్డుల వేడుక అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన జేమ్స్‌ కామెరూన్‌ గతేడాది రాజమౌళితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి అద్భుతం చేశారు. ఆయన్ను కలవడం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచవేదికపై ఇండియన్‌ సినిమాను చూడడం ఆనందంగా అనిపించింది’ అని జేమ్స్ కామెరూన్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆర్ఆర్ఆఱ్ టీమ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసింది. మీ మాటలు మాకు ఎప్పుడూ ప్రేరణ కలిగిస్తాయి. మీ ప్రశంస మేం మరింత బెస్ట్ ఇవ్వడానికి దారి చూపుతాయి. భారతీయ సినిమా అన్ని హద్దులు చెరిపేసి అంతర్జాతీయ వేదికపై భవిష్యత్తులో మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం అంటూ వీడియో కింద క్యాప్షన్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version