‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై కాలా పాషా షాకింగ్‌ కామెంట్స్‌

-

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ పై కుర్చీ తాత షేక్ అహ్మద్ పాషా స్పందించారు. ‘మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్ ను పాటగా వాడుకోవడం సంతోషంగా ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఈ పాటలో ఒక్క స్టెప్ అయిన వేయాలని ఉంది. కుర్చీ డైలాగ్ ను సినిమాలో వాడుకున్నామని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాతో ముందే చెప్పారు. అంతేకాక ఆర్థిక సాయం కూడా చేశారు’ అని కుర్చీ తాత చెప్పారు.

Kaala Pasha shocking comments on the song Kurchi Madatapetti

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. శుక్రవారం విడుదలైన ఈ పాట ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేష్, శ్రీలీల స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ ఎనర్జిటిక్ గా మాస్ స్టెప్పులతో రఫ్ఫాడించారు. ఇక ఈ ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్ ను ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version