కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తిక్.. ఎంత అందంగా ఉందో..!

-

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ ముఖం చూపించకుండా తన జీవితంలోకి వస్తున్న అమ్మాయి గురించి పోస్ట్ రూపంలో వెల్లడించారు. దీంతో త్వరలోనే కెవ్వు కార్తిక్ పెళ్లి పీటలెక్కపోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె ఎవరు ?ఎలా ఉంటుంది అనే విషయాన్ని తాజాగా ఆమెతో దిగిన ఫోటోలను మరొకసారి ప్రేక్షకుల ముందు వుంచాడు.. తాజాగా కెవ్వు కార్తిక్ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే లైఫ్ మరింత హ్యాపీగా మారుతుందని కొంతమంది చెప్పారు.. బహుశా ఆ హ్యాపీనెస్ ఇదేనేమో అంటూ రాసుకు వచ్చాడు..

అంతేకాదు తన జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థాంక్యూ అని.. తనతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు తాను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ కార్తీక్ తెలిపాడు. అయితే ఇప్పుడు తాజాగా తనకు కాబోయే భార్య సిరి అంటూ ఆమెతో దిగిన ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది అని.. ఈడు జోడు చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది అని.. ఇది చూసిన అభిమానులందరూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే కెవ్వు కార్తిక్ చేసుకోబోయే అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెబుతున్నారు. కెవ్వు కార్తిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా హైదరాబాద్లో అడుగుపెట్టి జబర్దస్త్ లో అవకాశాన్ని అందుకొని ఇప్పుడు జబర్దస్త్ టీం లీడర్ గా కొనసాగుతున్నారు. ఆయన పుట్టింది వరంగల్ .. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా తక్కువ పేమెంట్ కి షోలు చేస్తూ ఇప్పుడు జబర్దస్త్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version