నానికి జోడీగా కేజీఎఫ్ హీరోయిన్..!

-

టాలీవుడ్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు నాని. ప్రస్తుతం హిట్ 3 తో చాలా బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ హిట్ 2కి సీక్వెల్ గా వస్తోంది. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి సందడి చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది.

నాని, శ్రీనిధిలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ఈనెల రెండో వారం షెడ్యూల్ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే హిట్ 3 నుంచి ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో అర్జున్ సర్కార్ గా నాని చాలా మాస్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రం మే 01, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version