లావణ్య త్రిపాఠికి ఉన్న తెలివి తేటలు అమోఘం ఏకంగా స్టార్ హీరోలనే టార్గెట్ చేసింది..!

టాలీవుడ్ కి ‘అందాలరాక్షసి’ సినిమాతో పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాని రాజమౌళి బాగా ప్రమోట్ చేశారు. అంతేకాదు మొదటి సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్శించింది. మనం సినిమాలో మెరిసింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్, విష్ణు తో దూసుకెళ్తా, అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు, మన్మధుడు నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఒకవైపు నాని, సాయి ధరం తేజ్ లాంటి యంగ్ హీరోల సరసన నటిస్తూనే నాగార్జున వంటి సీనియర్ హీరోలకి ఇప్పుడు మంచి ఛాయిస్ లా మారింది ఈ బ్యూటి ఫుల్ హీరోయిన్.

 

ఇక రీసెంట్ గా నిఖిల్ తో వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమా తో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సస్ తో లావణ్య త్రిపాఠి ట్రాక్ లోకి వచ్చేసింది. తమిళంలో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ అధర్వ మురళీ సరసన నటిస్తుంది. ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’లో హీరోయిన్ గాను నటిస్తోంది. ఇక ఈ బ్యూటి టాలీవుడ్ స్టార్ హీరోలపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్మవుతున్నాయి.

అయితే అద్భుతంగా చేసిన లావణ్య కామెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ … చాలా కూల్ గా ఉంటాడని చెప్పిన లావణ్య… రాంచరణ్ ఓ అద్భుతమని.. జూనియర్ ఎన్టీఆర్ ను మరో హీరో ఎవరూ మ్యాచ్ చేయలేరని.. అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉంటాడని ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చింపేసింది.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రతీ విషయం పైనా స్పందిస్తాడని.. ఇక మెగాస్టార్ చిరంజీవి నిజమైన హీరో అని… ఆమె ఆరాధించే నటుల్లో ఆయన కూడా ఒకరని చెప్పింది. ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసి ఆకట్టుకుంది. మొత్తానికి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి లావణ్య ప్లాన్ బాగానే ఉంది. మరి ఏ స్టార్ హీరో అయినా సినిమా ఇస్తే తనేంటో నిరూపించుకుంది.