పింక్ సారీ లో అందాలతో అదరహో అనిపిస్తున్న లావణ్య త్రిపాఠి..!

-

ప్రముఖ హీరోయిన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదని చెప్పాలి. అయితే ఏమైందో తెలియదు కానీ గత రెండు నెలలుగా ఇంస్టాగ్రామ్ కి కూడా దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు మళ్లీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా పింక్ శారీలో హోయలు పోతూ బ్లౌజ్ ధరించి కిర్రాక్ ఫోజులతో యువతకు మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కిక్ ఎక్కించే ఫోజులకు సోషల్ మీడియాలో యువత సైతం ఫిదా అవుతున్నారు.

అంతేకాదు పింక్ సారీ ధరించిన ఈమె ఆ ఫోటోలను షేర్ చేస్తూనే ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. పింకు ధరించడం వల్ల నేనెప్పుడూ అలసిపోతానని అనుకోను అంటూ పేర్కొంది. ప్రస్తుతం లావణ్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే అందాల రాక్షసిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి మొదటి చిత్రంతోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. కాస్త బోల్డ్ గా ఉన్న పాత్రలలో కూడా నటించి మెప్పిస్తున్న ఈమె స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇక ఈ సినిమా తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. కానీ యావరేజ్ హిట్స్ కూడా అందుకున్న లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా ఇచ్చిన ఇమేజ్ మరే సినిమా ఇవ్వలేదని చెప్పవచ్చు. అర్జున్ సురవరం, ఏ వన్ ఎక్స్ప్రెస్ వంటి చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. ఆ తర్వాత చావు కబురు చల్లగా, హ్యాపీ బర్తడే వంటి చిత్రాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో తనల్ అనే చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version