‘లెజెండ్’కు పదేళ్లు.. రీరిలీజ్ కు మేకర్స్ సన్నాహాలు

-

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లో లెజెండ్ది ప్రత్యేక స్థానం. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. బాలయ్య సినిమా కెరీర్లో లెజెండ్ సాలిడ్ బ్లాక్ బస్టర్. 2014లో విడుదలైన ఈ సినిమా ఈ ఏడాదితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేశారు. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, స్నేహా ఉల్లాల్ నటించారు. నమిత ఓ కీలక పాత్రలో కనిపించారు.

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది, ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్కు.. నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్కు.. తొక్కి పడేస్తా, ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్కు థియేటర్లో పూనకాలే వచ్చేశాయి. అయితే మరోసారి ఈ జాయ్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులకు ఇస్తున్నారు లెజెండ్ మూవీ మేకర్స్. ఈ సినిమాను రీరిలీజ్ చేసే పనిలో పడ్డారు. మార్చి 30న లెజెండ్ మూవీ గ్రాండ్గా రీ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version