Mahesh Babu: మేజర్ అప్‌డేట్ ఇచ్చేసిన మహేశ్ బాబు..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా మరో మేజర్ అప్ డేట్ ఇచ్చేశారు. అయితే, అది తను నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం గురించి కాదండోయ్.. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ‘మేజర్’ ఫిల్మ్ గురించి..అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 3న విడుదల చేస్తు్న్నట్లు తెలిపారు.

ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 26/11 అటాక్ హీరో..మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దేశభక్తికి సంబంధించిన ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని ఈ సందర్భంగా మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘మేజర్’ రిలీజ్ పోస్టర్ లో అడివి శేష్ ఆర్మీ మ్యాన్ గా ఆకట్టుకుంటున్నాడు. మువ్వెన్నెల జెండా రెప రెపలాడుతుండగా, ఆర్మీ సోల్జర్ గా అడివి శేష్ అలా చూపులతోనే అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నాడు.

ఇక మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ పిక్చర్ వచ్చే నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా ‘మహానటి’ కీర్తి సరేశ్ నటించింది.