అలనాటి సినిమాల టైటిల్స్ ను ఇప్పుడు చాలా మంది హీరోలు, దర్శకులు వాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా అప్పటి టైటిల్స్ తో వస్తున్న సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ అందుకు పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. అయితే, ఓన్లీ టైటిల్ వరకు తీసుకుని స్టోరి లైన్ ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు మార్చుకుని హిట్స్ అందుకుంటున్నారు.
అప్పటి చిత్రాల టైటిల్స్ మాత్రమే కాకుండా స్టోరిలైన్ ను కూడా వాడుకుని సినిమాలు తీసి హిట్ అందుకున్నారు ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’ పిక్చర్..తన తండ్రి కృష్ణ నటించిన ఓ ఫిల్మ్ స్టోరి లైన్ సేమ్ ఉండటం గమనార్హం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి అందరికీ విదితమే.
‘శ్రీమంతుడు’ స్టోరి విషయానికొస్తే..మహేశ్ బాబు..తన తండ్రిని విడిచి తన పుట్టిన ఊరికి వెళ్లి అక్కడ పరిస్థితులను గురించి తెలుసుకుంటాడు. ధనవంతుడు అయిన మహేశ్..ఆ విషయం గ్రామస్తులకు చెప్పకుండా గ్రామానికి వచ్చి.. దత్తత తీసుకుని దానిని బాగు చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో శ్రుతిహాసన్ తో ప్రేమాయణం, విలన్స్ తో క్లాష్ జరుగుతుంది.
ఇదమిద్దంగా ఇది ‘శ్రీమంతుడు’ చిత్ర సారాంశం. కాగా, ఇటువంటి కథతోనే కృష్ణ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్లో కృష్ణ ‘రామరాజ్యంలో భీమరాజు’ అనే చిత్రం చేశాడు. ఇందులోనూ కృష్ణ ధనవంతుడి తనయుడు. కానీ, ఆ విషయం చెప్పకుండా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాడు. చివరకు అతను ధనవంతుడన్న సంగతి రివీల్ అవుతుంది. అలా తండ్రీ కొడుకులు కృష్ణ-మహేశ్ బాబు దాదాపుగా సేమ్ స్టోరిలైన్ తో పిక్చర్స్ తీసి సక్సెస్ అందుకున్నారు. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.