ఆ విషయంలో ‘సర్కారు వారి పాట’కు..‘ఆచార్య’ను మించిన సక్సెస్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కిన పిక్చర్ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇటీవల విడుదలైన మెగాస్టార్ ‘ఆచార్య’..భారీ అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ వస్తోంది. కలెక్షన్స్ విషయంలోనూ అంతగా సత్తా చాటడం లేదని తెలుస్తోంది. కాగా, ఈ అంచనాల విషయమై మాత్రం ‘సర్కారు వారి పాట’..‘ఆచార్య’ను మించిన సక్సెస్ అప్పుడే అందుకున్నదని మహేశ్-కృష్ణ అభిమానులు అంటున్నారు.

అంచనాలను పక్కనబెట్టి..‘సర్కారు వారి పాట’ స్టోరి లైన్ కు తగ్గట్లు పాత్రను డైరెక్టర్ పరశురామ్ చక్కగా డిజైన్ చేశారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సినిమా స్టోరి లైన్ కాని యాక్షన్ సీక్వెన్సెస్ కాని మహేశ్ బాబు స్థాయిని పెంచే విధంగా ఉంటాయని ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరశురామ్ హామీ ఇచ్చేస్తున్నారు.

దర్శకుడు పరశురామ్..టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనిమక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ గా కొన్నాళ్లు పని చేశారు. ఈ నేపథ్యంలోనే ‘సర్కారు వారి పాట’ పిక్చర్ ..వైబ్స్ కొన్ని ‘పోకిరి’ లాగా కనబడుతున్నాయని చాలా రోజుల నుంచి టాక్ వస్తోంది.

మొత్తంగా మహేశ్ అభిమానులకు మంచి సినిమాను ఇచ్చేందుకు తాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టానని, కాన్ఫిడెంట్ గా ఉన్నానని పరశురామ్ చెప్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి సెకండ్ ట్రైలర్ తో పాటు మరో సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.