ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మించే ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారట.
చిరంజీవి తన పుట్టిన రోజు అభిమానులకు మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. తన నెక్ట్స్ సినిమాని ప్రారంభించబోతున్నారు. తన 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఇది ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కొత్త సినిమాల విషయంలో వేగం పెంచారు. ప్రస్తుతం ఆయన ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. దీన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. అయితే కొరటాల దర్శకత్వంలో రూపొందే సినిమా ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేశారట. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో తన పుట్టిన రోజున తన అభిమానులకు మంచి బహుమానం ఇవ్వబోతున్నారు చిరు. ఇది కొరటాల శివ మార్క్ సామాజిక సందేశం, వాణిజ్య విలువల సమాహారంగా సాగుతుందట.
ఇదిలా ఉంటే, ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందుకనుగుణంగానే ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని, ఓ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు, మరో నాయిక కోసం నయనతార, తమన్నా, అనుష్క, శృతి హాసన్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారట. మరి వారిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది వేచి చూడాలి. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా వచ్చే సమ్మర్‌కి విడుదలకు రంగం సిద్ధం చేశారట. గతేడాది మహేష్‌బాబుతో కొరటాల శివ ‘భరత్ అనే నేను’ అనే సినిమాని రూపొందించారు. ఆ తర్వాత ఇంకా మరే సినిమాకి కమిట్ కాలేదు. చిరు సినిమా కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్న విషయం విదితమే.
ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మించే ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో నయనతార కథానాయికగా, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో అనుష్క మెరవనున్నారు. ఆమె సినిమా ప్రారంభంలో ఎంట్రీ ఇవ్వనున్నారట. సైరా కథని ఆమెనే నెరేట్ చేయనున్నారని తెలుస్తుంది. చిరంజీవి పుట్టిన రోజున ఈ సినిమాకి సంబంధించి మరో సర్‌ప్రైజ్‌ని అభిమానులకు అందించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.