బిగ్ బాస్: హౌస్ నుండి మెహబూబ్ వెళ్ళిపోతున్నాడా..?

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో మూడవ ఎలిమినేషన్ రానే వచ్చింది. ఈ సారి నామినేషన్స్ లో 9మంది ఉన్నారు. 9మందిలో హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తున్నారనేది ఆసక్తిగా ఉంది. ఐతే ఈ సారి మెహబూబ్ ఎలిమినేట్ అవుతున్నాడని అంటున్నారు. మూడు వారాలుగా హౌస్ లో ఉంటున్న మెహబూబ్ పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. హౌస్ మేట్స్ తో కలవడానికే చాలా టైమ్ తీసుకున్నాడు. అదీగాక ఈ వారం టాస్కులో మెహబూబ్ చేసిన అతి ప్రేక్షకుల్లో ఒకరకమైన అభిప్రాయానికి తీసుకువచ్చింది.

సినిమా డైలాగ్ చెప్పినట్టుగా మెహబూబ్ బాగా రెచ్చిపోయాడు. దీంతో ఎలిమినేషన్లోకి వచ్చేసాడని చెబుతున్నారు. నిజానికి అరియానా గ్లోరీ, దేవి నాగవల్లి, కుమార్ సాయి కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ మెహబూబ్ చేసిన పనికి అందరూ సేఫ్ అయ్యారు. ఐతే ఈ విషయం మెహబూబ్ కి కూడా అర్థమైంది. అందుకే సోహైల్ మాట్లాడుతున్నప్పుడు మనం అనవసరంగా టాస్కుని బాగా సీరియస్ గా తీసుకున్నాం అంటూ మాట్లాడాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడా లేదా చూడాలి. ఒకవేళ మెహబూబ్ ఎలిమినేట్ అయితే సోహైల్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news