నిన్న రాత్రి మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన సంఘటన పై మంచు మనోజ్ స్పందించారు. మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన సంఘటన స్థలంలో,మీడియపై దాడులను ఖండిస్తూ,జర్నలిస్టు ప్రతినిధులు ప్రొటెస్ట్ చేస్తుండగా మద్దతు తెలిపారు. మంచు మనోజ్.
ఈ సందర్బంగా భావోద్వేగానికి గురైన మంచు మనోజ్.. కంటతడి పెడుతూ మీడియా తో మాట్లాడారు. సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్… మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు…. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారని ఆగ్రహించారు. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా.. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు.. నా భార్య, ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారు.. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నా అని చెప్పారు. నేను ఎవరిని ఆస్తి అడగలేదు.. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా అని వెల్లడించారు మంచు మనోజ్.