ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. అయితే… ఆయన పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా వెయ్యి ఎకరాల అడవిని దత్త తీసుకుంటూ ప్రకటన చేశారు అక్కినేని నాగార్జున. చెంగిచెర్ల లో ఉన్నటువంటి వెయ్యి ఎకరాల అడవిని అక్కినేని నాగార్జున దత్తత తీసుకున్నారు.
సిఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ దత్తత కార్యక్రమాన్ని చేపట్టారు అక్కినేని నాగార్జున. అంతేకాదు తన తండ్రి పేరుతో అక్కినేని అర్బన్ ఫారెస్ట్ పార్క్ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు అక్కినేని నాగార్జున.
కాగా గతంలో బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే లో తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుంటానని అక్కినేని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా పార్లమెంటు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ కీలక నేత జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.