జాతీయ అవార్డు ఆయనకే రావాలి – విజయ్ దేవరకొండ..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఇటీవల 69వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరగగా ఈ కార్యక్రమంలో ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 నేషనల్ అవార్డ్స్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో వచ్చిన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన సినిమాకు అలాగే మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమాకి గాను జాతీయ అవార్డులు లభించాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించగా.. ఈ సినిమా మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ తో కలిసి విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.

విజయ్ దేవరకొండ జాతీయ అవార్డుల ప్రస్తావనను తీసుకొస్తూ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.ఇకపోతే పుష్ప సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకోగా అయితే ఈ అవార్డు సుకుమార్ గారికి కూడా రావాల్సి ఉండేదని విజయ్ దేవరకొండ తెలిపారు. నటుడుగానే కాదు ఉత్తమ డైరెక్టర్ గా కూడా సుకుమార్ గారికి జాతీయ అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇకపోతే విజయ్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version