‘స్కంద’ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌.. రామ్-శ్రీలీల అదరగొట్టేశారుగా

-

రామ్‌ పోతినేని-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న స్కంద సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకులకు మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. నీ చుట్టూ చుట్టూ అంటూ సాగే పెప్పీ నెంబర్‌ సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ఇంగ్లీష్ వోకల్స్‌తో సాగిన ప్రోమో అదిరిపోయింది.

ఇక  ఈ ప్రోమోలో రామ్-శ్రీలీల జంట అదిరిపోయింది. వెస్టర్న్ ఔట్ ఫిట్స్ లో వెస్టర్న్ డ్యాన్సులో అదరగొట్టారు. తమన్‌ స్వర పరిచిన ఈ పాటకు రఘురామ్‌ సాహిత్యం అందించగా.. సిధ్ శ్రీరామ్‌, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఈ పాట ఫుల్‌ లిరికల్ వీడియో ఆగస్టు 3న రిలీజ్‌ కాబోతుంది.  ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్‌ 15న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version