టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన ఈ కథా నాయకుడు..కొంత కాలం పాటు రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి చిత్ర సీమకు రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ఈయన తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆచార్య సినిమా ట్రైలర్ లో చిరంజీవిని చూస్తుంటే తమకు 1980, 1990ల్లో నాటి చిరు గుర్తొస్తున్నాడని మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ దశకాల్లో చిరంజీవి నటించిన ఫిల్మ్స్ చూస్తే కనుక వాటిల్లో బలమైన స్టోరితో పాటు మాస్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉంటాయి. కొరటాల శివ కూడా ఈ విషయాలపైన ఫుల్ ఫోకస్ పెట్టారన్న సంగతి ట్రైలర్ చూస్తుంటే తెలుస్తున్నది.
బలమైన కథతో ప్రేక్షకులకు కావాల్సినట్లుగా చిరును కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నారట. ఇక ఇందులో యాడెడ్ అడ్వాంటేజ్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు.
తెలుగు ప్రేక్షకులకు చిరు చివరగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కనిపించారు. ఆ సినిమా తర్వాత కొవిడ్ ప్రభావం వలన ఆయన నటించిన సినిమాలన్నీ షూటింగ్ దశలోనే ఉండిపోయాయి. ఈ నెల 29న విడుదల కానున్న పిక్చర్ లో చిరుకు జోడీగా పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ నటించింది. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది.