Prithviraj Sukumaran: ఏడాదిలో 20 సినిమాలు చేస్తున్న స్టార్ హీరో..‘గోల్డ్’ ఫస్ట్ లుక్ ఔట్

-

టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తుండటం మనం చూడొచ్చు. కాగా, మాలీవుడ్ (మలయాళం) మల్టీ టాలెంటెడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఒక్క ఏడాదికి ఏకంగా 20 సినిమాలకు కమిట్ అయ్యారని సమాచారం. ఇందులో వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటించిన చిత్రాలు చాలానే విడుదలయ్యాయి.

ఇటీవల విడుదలైన ‘జన గణ మన’ ప్రేక్షకులతో పాటు విమర్శకులను బాగా ఆకట్టుకుంది. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో వకీల్ సాబ్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమవుతోంది. ‘బ్రో డాడీ’, ‘జన గణ మన’ సక్సెస్ లను పృథ్వీరాజ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ‘గోల్డ్’ చిత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పృథ్వీరాజ్ హాయిగా నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుండగా, నయనతార అయోమయంగా కనబడుతోంది. ఈ మూవీని పృథ్వీరాజ్​ ప్రొడక్షన్స్​, మ్యూజిక్​ ఫ్రేమ్స్​ బ్యానర్స్‌పై సుప్రియా మీనన్, లిజిన్​ స్టీఫెన్​ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ప్రేమమ్’​ ఫేమ్​ అల్ఫోన్స్​ పుత్రెన్​ దర్శకత్వం వహిస్తుండగా, ఈ పిక్చర్ ఈ ఏడాది ఆగస్టు 19న విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news