స్త్రీలపై ఎక్కడ చూసిన అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషి రూపంలో ఉన్న మృగాళ్లు తమ కామ వాంఛ తీర్చుకోవడానికి చిన్నారుల జీవితాలను బలి చేస్తున్నారు. హైదరాబాద్ పబ్‌లో మైనర్ బాలిక రేప్, ఓ బాలికను కిడ్నాప్ ఘటనల పరంపరం కొనసాగుతోంది. తాజాగా మరో దారుణ ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. సోమవారం మరో మైనర్ బాలిక అత్యాచారానికి గురైన ఘటన వెలుగు చూసింది.
ఈ ఘటనలో వేగంగా స్పందించిన పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ సురేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పట్టపగలు నెక్లెస్ రోడ్‌పై చోటుచేసుకోవడం గమనార్హం. ఓ మైనర్ బాలికను బర్త్ డే వేడుకల కోసమంటూ నెక్లెస్ రోడ్‌కు తీసుకువచ్చిన సురేశ్…నెక్లెస్ రోడ్‌పై కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన రాంగోపాల్‌పేట పోలీసులు నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.