చిరంజీవి చెల్లెలిగా నయనతార..‘గాడ్ ఫాదర్’ లీక్ ఇచ్చేసిన థమన్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన చిత్రాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ను తానే స్వయంగా లీక్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజెస్ ఇస్తుంటారు. అలా ఇప్పటికే ‘ఆచార్య’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల టైటిల్స్ తో పాటు ఇతర విషయాలు చెప్పేశారు. కాగా, ఈ సారి మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన కీలక విషయమొకటి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు.

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మాలీవుడ్(మలయాళం)సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.

ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆమె పాత్ర ఏమిటి అనే విషయం ఎవరికీ తెలియదు. కాగా, తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో జరిగిన ఇండియన్ ఐడియల్ తెలుగు మెగా ఫినాలే ఎపిసోడ్‌లో థమన్ నయనతార పాత్ర గురించి లీక్ చేశారు.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నయనతార నటిస్తుందని, వారిద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ పాటని ఇండియన్ ఐడియల్ తెలుగులో మూడో స్థానంలో నిలిచిన వైష్ణవి పాడుతుందని థమన్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలోనే ఈ విషయం థమన్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో నయనతార, చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ పిక్చర్ లో జంటగా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news