‘మాస్టర్’ను మించిన యాక్షన్..తలపతి 67 అప్‌డేట్ ఇచ్చేసిన లోకేశ్ కనకరాజ్..

-

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ -లోక నాయకుడు కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ‘విక్రమ్’ ఫిల్మ్..ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను జనం విశేషంగా ఆదరిస్తున్నారు. కమల్ హాసన్, సూర్య, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా..లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేషన్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరిట నితిన్ విడుదల చేయగా, ఇక్కడా వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే లోకేశ్ కనకరాజ్ నెక్స్ట్ ఫిల్మ్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన తదుపరి చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ఉంటుందని చెప్పారు.

ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో తలపతి విజయ్ 67వ సినిమా అప్ డేట్ ఇచ్చారు లోకేశ్. ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా ఉండబోతున్నదని, తన హృదయానికి బాగా దగ్గరైన స్క్రిప్ట్ ఇది అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్.

ఇక ఈ విషయం తెలుసుకుని విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 22న విజయ్ బర్త్ డే కాగా, బర్త్ డే కంటే ముందే తలపతి 67 అప్ డేట్ ఇచ్చేసిన లోకేశ్ కు థాంక్స్ చెప్తున్నారు. ‘మాస్టర్’ ను మించి..ఈ సినిమా ఉండాలని డైరెక్టర్ కు సూచనలిస్తున్నారు తలపతి విజయ్ అభిమానులు.

 

Read more RELATED
Recommended to you

Latest news