నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. కారణం..?

-

ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కి ఇప్పుడు సినీ కెరియర్ లో పెద్దగా అవకాశాలు లభించలేదు. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈమె మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి చేత తన ఇంట్లో పూజలు చేయిస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పటికే ఎంతో సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఇకపోతే గతంలో కూడా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారు అని ప్రకటించి ఆశ్చర్యాన్నికి గురి చేసినా.. అందుకు తగ్గట్టుకొని నాలుగు సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. దీంతో వేణు స్వామి మాటలు నిజమేనని అందరూ విశ్వసించడం మొదలుపెట్టారు. ఇకపోతే ఇప్పుడు చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటూ కెరియర్లో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న, కృతి శెట్టి వంటి వారు కూడా ప్రత్యేకంగా పూజలు చేయించడం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి నిధి అగర్వాల్ కూడా చేరిపోయింది.

ఇప్పుడు నిధి అగర్వాల్ ఇంట్లో రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిధి అగర్వాల్తో వేణు స్వామి బృందం పూజ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నిధి అగర్వాల్ పింక్ కలర్ చుడీదార్ ధరించి వేణు స్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల మధ్య కలశానికి పూజలు చేసింది.ఇక నిధి అగర్వాల్ పక్కనే కూర్చుని వేణు స్వామి ఈ పూజ చేయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version