రామోజీరావు మృతి…” నిన్ను చూడాలని” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

-

రామోజీరావు మృతి నేపథ్యంలో…” నిన్ను చూడాలని” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు  నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం అన్నారు.
NTR CONDOLENSE TO RAMOJI RAO
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ వెల్లడించారు.
అటు ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version