పండుగవేళ.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య..!

-

సాధారణంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటారు టాలీవుడ్ హీరోలు. ఇవాళ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టీజర్, యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ కోహినూర్ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా తన అభిమానుల్లో మంచి జోష్ నింపారు. 

మాస్ దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించేశారు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నాలుగోసారి నటించబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. #BB4 వర్కింగ్ టైటిల్ తో ఇది రూపొందనుంది. అక్టోబర్ 16న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దీంతో నందమూరి అభిమానులు పుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే  బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో లేదా సంక్రాంతి బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో బాలయ్య తనయుడు మోక్షాజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ పాత్రలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంతుందనేది చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version