ఈ వారం ఓటీటీలో ఈ సినిమాలు/సిరీస్​లదే హవా

-

సమ్మర్ ఎండింగ్ వచ్చేస్తోంది. ఇంకొన్ని రోజులైతే ఇక స్కూళ్లు, కాలేజీలు షురూ ఆవుతాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో ఓటీటీలో సూపర్ సినిమాలు, సిరీస్​లు సందడి చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వారంలో వస్తోన్న సినిమాలు చూసి సమ్మర్ హాలీడేస్​ను జాలీగా ఎంజాయ్ చేయండి.

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’.  మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘భేడియా’. తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు.  ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ ఏప్రిల్‌ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్‌ చొప్పున అందిస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ మే 26 స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌

  • విక్టిమ్‌/సస్పెక్ట్‌ (హాలీవుడ్) మే 23
  • మదర్స్‌ డే (హాలీవుడ్‌)  మే 25
  • ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌) మే 25
  • బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (హాలీవుడ్‌) మే 26

అమెజాన్‌ ప్రైమ్‌

  • మిస్సింగ్‌ (ఒరిజినల్‌ మూవీ) మే 24

జీ5

  • సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (ఒరిజినల్‌ మూవీ) మే 23

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌) మే 24
  • సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 26

ఆహా

  • గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3) మే 23
  • సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మే 26

Read more RELATED
Recommended to you

Exit mobile version