మా పర్సనల్‌ ఫొటోలు 5 వేలు వరకు ఉన్నాయి.. తమన్నా ప్రియుడు విజయ్ వర్మ కామెంట్స్

-

టాలీవుడ్ యాక్టర్ తమన్నా ఇటీవలి కాలంలో బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్ షిప్ ఉన్న విషయాన్ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ చాలా కాలంలో రిలేషన్‌లో ఉన్నప్పటికీ బయటకు తెలియనివ్వలేదు. తాజాగా అదే విషయంపై మిల్కీబ్యూటీ ప్రియుడు విజయ్ వర్మ స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘ఇద్దరి మధ్యలో ఎటువంటి బంధం ఉన్నా కలిసి సమయాన్ని ఆస్వాదించాలని అనుకున్నప్పుడు.. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పుడు దానిని దాచి ఉంచాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మా ఇద్దరి ఒపీనియర్ ఒక్కటే. రిలేషన్ షిప్‌ను గోప్యంగా ఉంచడం అంత ఈజీకాదు. కలిసి బయటకు వెళ్లడం, ఫొటోలు తీసుకోవడం సాధ్యపడదు.

ఇక ఫీలింగ్స్‌ను అణిచిపెట్టి ఉంచుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకు మాకు సంబంధించిన విషయాలను చాలా వరకు బయటకు చెప్పినా కొన్ని విషయాలను మాత్రం ప్రైవేట్‌గా ఉంచాం. తమన్నా నేను కలిసి దిగిన పర్సనల్ పిక్స్ నా దగ్గర సుమారు 5000 వరకు ఉన్నాయి.వాటిని నేను ఎక్కడా షేర్ చేయలేదు. ఎందుకంటే అవి మాకు మాత్రమే సంబంధించినవి’ అని విజయ్ వర్మ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version