కొరియాలో ‘దృశ్యం’ రీమేక్.. హీరోగా పారాసైట్ యాక్టర్

-

ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొరియన్ సినిమాలు రీమేక్ చేసింది. కానీ మొట్టమొదటి సారిగా ఓ భారతీయ సినిమా కొరియా భాషలోకి రీమేక్ కాబోతోంది. అదే దృశ్యం ఫ్రాంచైజీ. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా పార్ట్-1, పార్ట్-2లు రెండూ సినీ ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం సౌత్ కొరియాలో రీమేక్ కానుంది.

దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌తో కలిసి, పనోరమా స్టూడియోస్‌ ఈ సినిమాని కొరియన్‌ భాషలో రీమేక్‌ చేయనుంది. ఈ వివరాల్ని ఆదివారం సినీవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కొరియన్‌ ‘దృశ్యం’లో ‘పారాసైట్‌’ ఫేం సాంగ్‌ కాంగ్‌ హో కథానాయకుడిగా నటించనున్నారు. దీంతో కొరియన్‌ భాషలోకి రీమేక్‌ అవుతున్న తొలి చిత్రంగా ‘దృశ్యం’ నిలవనుంది.

‘‘దృశ్యం’ ఫ్రాంచైజీ చిత్రాలు కొరియన్‌ భాషలో పునర్నిర్మించడం పట్ల చాలా ఉత్సుకతతో ఉన్నా. దీంతో ఈ కథ ఎక్కువమంది ప్రేక్షకులకి చేరువ కావడమే కాదు.. హిందీ సినిమాని ప్రపంచ పటంలో నిలపనుంది’ అంటూ నిర్మాత కుమార్‌ మంగత్‌ పాఠక్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version